
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు అండగా ఉంటుందని కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు… ఆదివారం జిల్లా కేంద్రంలోని కళాభారతిలో ఆదర్శ దివ్యాంగుల ఆత్మీయ అభినందన సభ జరిగింది..పలువురు దివ్యంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిని ఘనంగా సన్మానించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పలువురి దివ్యాంగులను మెమెంటో తో సత్కరించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ చేదోడు వాదోడుగా ఉంటానని పేర్కొన్నారు..



