
–మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: చదువుల తల్లి సరస్వతిదేవి జయంతిని పురస్కరించుకొని సోమవారం వసంత పంచమి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో భక్తులు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్ధంగా జరిగాయి. హుజురాబాద్ పట్టణ శివారులోని రంగనాయకులగుట్ట సమీపాన గల పాటిమీద శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో ఉన్న సరస్వతీ మాత ఆలయంలో సోమవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం కోసం దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. పెద్ద ఎత్తున భక్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు దేవాలయానికి వచ్చి సరస్వతి దేవికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. తమ పిల్లలు చదువులో ఉన్నత స్థితికి రావాలని తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లలు సైతం పెన్నులు, ప్యాడ్లు ఇతరులకు పంచిపెట్టారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వేద పండితులు శాస్త్రోత్కంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములను వితరణ చేశారు. పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ గందె శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, అపరాధ. ముత్యంరాజు, పూజారులు తిరునగరి తిరుమలేష్, తిరునగరి సత్యనారాయణ స్వామి, లలిత్ కుమారాచార్యులు, కుర్జీ ప్రదీప్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా
వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని హుజురాబాద్ వాసవి క్లబ్ గ్రేటర్ మరియు వాసవి వనిత క్విన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక రంగనాయకుల గుట్ట వద్ద ఉన్న శ్రీ సరస్వతి దేవి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా పిల్లలకు పలకలు, పెన్స్ ,పెన్సిల్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మాజీ చైర్ పర్సన్ గందే రాధిక – శ్రీనివాస్, క్లబ్ సభ్యులు హుజురాబాద్ వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షులు అకినపల్లి శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి చిదురాల నాగరాజు, కోశాధికారి దేవునురీ సాయితేజ, వాసవి వనిత క్విన్స్ క్లబ్ అధ్యక్షులు నర్ల అర్చన్, ప్రధాన కార్యదర్శి చీకోటి త్రివేణి, కోశాధికారి శివనాథుని స్వప్న తదితరులు పాల్గొన్నారు.
అలాగే పట్టణంలోని రంగనాయకులగుట్ట వద్ద పాటి మీద ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఉన్న సరస్వతి దేవి ఆలయంలో సోమవారం రోజున పట్టణంలోని న్యూ కాకతీయ మోడల్ స్కూల్, విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ మరియు పలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతిదేవికి సామూహిక ప్రత్యేక పూజలు, అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆలయ అర్చకులు తిరుమల్ చార్యులు పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు రమేష్, శ్రీనివాస్, శ్రీనివాస్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








సామూహిక అక్షరాభ్యాసంలో చిన్నారులతో అక్షరాలు దిద్దిస్తున్న తల్లిదండ్రు