
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని పలు వైన్సులపై మున్సిపల్ అధికారులు సోమవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైన్స్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడం పట్ల వారు వైన్స్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర వైన్స్, మందాకిని వైన్స్ యజమానులకు 5వేల రూపాయల చొప్పున జరిమానగా విధించారు. మరోసారి పారిశుధ్యం సక్రమంగా లేకపోతే షాపులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ కే సమ్మయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్ ఆర్.భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ యం కిషన్ రావు, వార్డు అధికారులు ఆర్.బాలగంగాధర్ తిలక్, సంపత్, ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ పి వినయ్, సానిటరీ జవాన్లు ఆర్ సుధీర్, ఎ. రమేష్, పి అనిల్ కుమార్, టి కుమారస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
