
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఫిబ్రవరి 06: మన దేశంలో జనాభా లెక్కలను ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి చేస్తారని జనాభా ప్రాతిపదికన లెక్కించిన ప్రతీ సారి జనాభా శాతం పెరుగుతుంటుంది, కాని మన తెలంగాణలో కులగణన చేసినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గి కేవలం ఓసిల జనాభా మాత్రం పెరిగే విధంగా కులగణన చేయడం జరిగిందని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈ విధమైన కులగణన సరియైనదా? కాదా? అనే అనుమాలున్నాయని తెలిపారు. ఇది సరియైనది కానప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఈప్రభుత్వం జవాబు చెప్పవలసిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా బీసీలు ఎందరున్నా ఎలక్షన్ మానిఫెస్టో లో కేవలం 42% మాత్రమే రిజర్వేషన్ ను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారని మరీ 56.3% జనాభా కి 42% ఇవ్వడం సరికాదని, మేం ఎంతో మాకంత రావాలిసిందేనని మండిపడ్డారు. అదేవిధంగా ఓబీసీలకి విద్య,ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో మా జనాభా అనుగుణంగా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మరీ దాని గురుంచి మాట్లాడిందే లేదని అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన డేటాను చెప్పడేమా..! కార్యాచరణ చేయడానికి తావు ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు ఇప్పకాయల సాగర్, జిల్లా నాయకుడు చిలకమారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
