
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
జాతీయ నులిపురుగు దినోత్సవంను పురస్కరించుకొని ఈనెల 10న హుజురాబాద్ మండలంలోని పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలని చెల్పూర్ పిహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ మధు అన్నారు. గురువారం హుజూరాబాద్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అంగన్వాడీ టీచర్లకు నులిపురుగుల నివారణ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈనెల 10న పిల్లలందరికీ నులిపురుగుల నివారణ కోసం వారు చదువుకునే పాఠశాలల్లో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ జరుగుతుందని, వాటిని వారు వేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది విజయేందర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
