
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట, ఫిబ్రవరి 6: జమ్మికుంట మండల వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట పట్టణ కృషి విజ్ఞాన కేంద్రంలో(కెవికె)లో డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమముపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకి మరియు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల అధ్యాపకులకి మరియు గ్రామీణ, పట్టణ ఐసిడియస్ అంగన్వాడీ టీచర్స్ కి ఆరోగ్య అవగహన సదస్సు నిర్వహించారు. ఈ ఆరోగ్య అవగహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ హేమలత మరియు ఎంపీఓ మరియు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు హాజరు అయ్యారు. ఈ సందర్బంగా డిప్యూటీ, డిఎంహెచ్ ఓ డాక్టర్ చందు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… నులి పురుగుల వలన కలిగే ఇబ్బందులు గురించి నులి పురుగుల వలన పిల్లల్లో పోషకాహార లోపం రక్తహీనత, తరచూ కడుపు నొప్పితో బాధ పడడం వంటి వివరిస్తూ వాటికి సంబంధించి తగు జాగ్రత్తలు తెలిపారు. నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినకూడదని బయట చేసే తినుబండారాలు కలుషిత ఆహార పదార్థాలు తినకూడదని, అన్నారు. సరైన పద్ధతిలో హ్యాండ్ వాష్ టెక్నిక్ చేయాలని అని వివరించారు. 1 నుండి 19 సంవత్సర పిల్లలందరికి ఆల్బెన్ డా జోల్ మాత్రలు ఫిబ్రవరి 10 సోమవారం రోజున తప్పకుండా పిల్లలందరి వేహించాలని సూచించారు. 1నుండి 2సంవత్సరం ల పిల్లలకి సగం మాత్ర మరియు 3నుండి 19 సంవత్సరంల పిల్లలకి పూర్తి 400 యంజి మాత్ర వేయాలని అన్నారు. తప్పిపోయిన పిల్లలకి ఈ నెల 17వ తారీఖున మల్లి వేయడం జరుగుతుంది అన్నారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని డిపార్ట్మెంట్ వారిని కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ చందు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ హేమలత, డాక్టర్స్ రాజేష్, చందన మరియు హెల్త్ ఎడ్యుకేటర్స్ ప్రతాప్, మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్స్ అరుణ, రత్నకుమారి, కుసుమ కుమారి, అన్ని పాఠశాలల, ,కళాశాలల, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

