
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శిశు మందిర్ పాఠశాల దగ్గర గల ప్రతాప్ వెంకటమ్మ- ఆదిరెడ్డిల రెండవ కుమారుడు ప్రతాప నాగరాజు ( 40) సంవత్సరాలు జీవనోపాధి నిమిత్తం హైదరాబాదుకు వెళ్లి సుతారిగా పనిచేస్తుండగా రెండు కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల గత శుక్రవారం రోజున మరణించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత్యక్రియలు డైరెక్ట్ గా స్మశాన వాటికలో చేశారు. ఇప్పుడు 11 రోజుల(పెద్దకర్మ) సందర్భంగా ఏమి చేయలేనీ దుస్థితిలో ఉండగా ఇంటి దగ్గరలో ఉన్న ఎస్సారెస్పీ రిటైర్డ్ వర్క్ ఇన్స్పెక్టర్ మునిగంటి రవీందర్ 2000 రూపాయల నగదు మరియు గంగిశెట్టి మధురమ్మ ట్రస్ట్ నిర్వాకుడు గంగిశెట్టి జగదీశ్వర్ 25 కిలోల రైస్ బ్యాగు అందించారు. గతంలో వీరి కోడలు క్యాన్సర్ తో మరణించగా రవీందర్ మరియు జగదీశ్వర్ లు పదివేల రూపాయలు నగదు సహాయం చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆదరిస్తున్న రవీందర్ ను, జగదీశ్వర్ ను ఆ వాడ ప్రజలు అభినందించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీధిలోని ప్రజలు పాల్గొన్నారు.
