
Oplus_131072
మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ 127 వ జయంతి సందర్భంగా హుజురాబాద్ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర జయంతిని ఘనంగా నిర్వహించారు. రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ రమాబాయి అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసి అంబేద్కర్ లండన్ లో చదువుకునే రోజుల్లో తను కూలి పనులు చేసి కష్టపడి సంపాదించిన డబ్బు లను అంబేద్కర్ కు పంపించి అండగా నిలిచారని ఆమె ఆశయాలను దళిత బహుజనులందరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి కమిటీ చైర్మన్ ఖాలిక్ హుస్సేన్, పూలే జయంతి కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, స్వామి రెడ్డి, సొల్లు బాబు, సొల్లు సునీత, వేల్పుల రత్నం, విష్ణుదాస్ గోపాలరావు , తులసి లక్ష్మణమూర్తి , డాక్టర్ తడికమల్ల శేఖర్, పాక సతీష్, అడ్వకేట్ మట్టెల తిరుపతి, వేల్పుల ప్రభాకర్, బొడ్డు ఐలయ్య, మోరే సతీష్, రామ్ రాజేశ్వర్, ఇల్లందుల సమ్మయ్య, గాజుల సంపత్, దాట్ల ప్రభాకర్, మేకల మొగిలి, కేంసారపు తిరుపతి, మంద రాజు తదితరులు పాల్గొన్నారు.
