
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఫిబ్రవరి 7: పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన కొలుగూరి సుజిత్(30) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొలుగూరి సుజిత్ గత కొన్ని రోజులుగా తాను ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అట్టి అమ్మాయి తనను ప్రేమించడం లేదని తన జీవితంపై విరక్తి చెంది గురువారం పట్టణంలోని బిఎస్సార్ గార్డెన్ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా అతనిని చికిత్స నిమిత్తం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడని పోలీసులకు మృతుని సోదరుడు సూర్య కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ తెలిపారు.

