
–కేసిరెడ్డి లావణ్య-నర్సింహారెడ్డి దంపతులకు పార్టీలకతీతంగా ఆత్మీయ సన్మానాలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఫిబ్రవరి 08: కృషి వుంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు.. అన్నట్లుగా మనము చేసే పనులు, నడవడిక, అభివృద్ధి మనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది అనడానికి నిదర్శనమే ఈ సంఘటన. అది ఎక్కడో కాదు.. హుజురాబాద్ పట్టణం నడిబొడ్డున అనునిత్యం చోటు చేసుకుంటున్నా తీరు పలువురిని ఆలోచింపజేస్తుంది. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు ప్రజలు ఆ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి దంపతులను పార్టీలకు అతీతంగా ఆ వార్డు ప్రజలు, అభిమానులు, వ్యాపారులు వైద్యులు ఒకరు ఇద్దరని కాదు కుల మతాలకతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై గత కొన్ని రోజులుగా నిత్యం ఘనంగా సన్మానిస్తుండడం పలువురిని ఆలోచింపజేస్తుంది. మూడు పర్యాయాలు ప్రజాప్రతినిధిగా ఎన్నికై గత 15 ఏళ్ళుగా లావణ్య నర్సింహారెడ్డి దంపతులు వార్డులో మమేకమై తమ సేవలందిస్తున్నారు. గతంలో మేజర్ గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ వార్డు మెంబర్ గా, తదనంతరం మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా కేసిరెడ్డి లావణ్య వరుసగా మూడు పర్యాయాలు గెలుపొంది సేవలందించారు. వార్డులో స్థానిక ప్రజలతో నిత్యం మమేకమై ప్రజల అవసరాలను గుర్తించి ఎలాంటి చిన్న సమస్య ఉన్న ‘అన్న అనగానే నేనున్నా’ అంటూ తక్షణమే అక్కడ వాలి నేనున్నానంటూ భరోసా ఇచ్చి వారి సమస్యను తీర్చే వరకు అక్కడి నుండి నిష్క్రమించకుండా భాగస్వాములైతున్న తీరు పలువురికి ప్రేరణగా నిలుస్తుంది. అంతేకాదు వార్డులోని ప్రతి ఇంటింటికి తన చాకచక్యంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాక వార్డు అభివృద్ధికి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని వారికి వర్తింపజేసేవారు. ఇటీవల లావణ్య నరసింహారెడ్డి కౌన్సిలర్ గా పదవీ కాలం ముగిసిన సందర్భంగా వార్డులో రోజుకు ఒక వర్గంగా ఏర్పడి పలువురు ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటి నుండి లావణ్య నర్సింహారెడ్డి దంపతులను ఘనంగా సన్మానిస్తున్నారంటే వారిపై అవార్డు ప్రజలకు ఎంత ప్రేమ, ఆదరాభిమానాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వార్డులో ఉన్న ప్రజల స్థానిక అవసరాలు గుర్తించి పనిని వాయిదా వేయక తక్షణమే పని చేయడం, ఒక్క పిలుపుతోనే వారి అవసరాలు తీర్చడం, విస్తృతంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం వారి మంచితనానికి, వారి సత్కారం పొందడానికి ప్రేరణగా నిలుస్తుంది. ప్రజాప్రతినిధిగా కౌన్సిలర్ లావణ్య నర్సింహా రెడ్డి దంపతులు మూడుసార్లు ఎన్నికల్లో ఎదుటి వ్యక్తులకు డిపాజిట్లు రాకుండా భారీ మెజారిటీతో గెలవడమే వారి అభివృద్ధికి, ప్రజా అభిమానానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఒకరు ఇద్దరు కాదు వార్డులోని ప్రతి ఇంటింటి ఆదరాభిమానాలు పూర్తిస్థాయిలో పొందుతున్నారు అంటే ఏ స్థాయిలో వారికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చును. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ విజయం సాధిస్తారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 15 ఏళ్ళ క్రితం పట్టణ నడి ఒడ్డున అభివృద్ధిలో వెనుకబడిన వార్డుగా ఈ వార్డు ఉండేది. కాగా కౌన్సిలర్ గా ఉన్న లావణ్య ఆమె భర్త నర్సింహా రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని, ప్రభుత్వ అధికారుల, వార్డు ప్రజలు, వ్యాపారుల సహకారంతో హుజురాబాద్ కు వన్నె తెచ్చే విధంగా వార్డులోని అన్ని వీధుల్లో అభివృద్ధి పనులు చేపట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు. అన్ని వీధుల్లో వందశాతం సిసి రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేసారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు హరితహారం నిర్వహించారు. ఇంకా అనేక సంక్షేమ, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలోనూ ధైర్యంగా ప్రజలకు అండగా నిలిచి సేవా కార్యక్రమాలు నిర్వహించి భరోసా ఇచ్చారు. హుజురాబాద్ పట్టణానికి ‘గుండెకాయ’గా, వ్యాపార, వాణిజ్యం కూడలిగా, మోడల్ గా ఉన్న ఈ వార్డులో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనడంలో ఏలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి ఇంటికి నల్లా నీళ్లు, అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించి సమస్యలు లేని వార్డుగా తీర్చిదిద్దడంలో కౌన్సిలర్ లావణ్య దంపతులు సఫలీకృతం అయ్యారు. ప్రజలు, వ్యాపారులు తమ దృష్టికి తీసుకువచ్చే.. పారిశుధ్య ఇతర సమస్యలను క్షణాల్లో పరిష్కరించారు. వార్డులో ఎవరికి ఏ ఆపద ఉన్న మేమున్నాం.. అంటూ.. భరోసా ఇచ్చారు. లావణ్య దంపతులు పార్టీలకు అతీతంతా ప్రజల మనసులు గెలుచుకున్నారు. అందుకే వరుసగా రెండుసార్లు ఉత్తమ అవార్డుగా ఎంపికై అధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకోవడం సన్మానాలు పొందడం వారి పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇటీవల కౌన్సిలర్ గా ఐదేళ్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి దంపతులకు ప్రజలు పార్టీలకు అతీతంగా వార్డు ప్రజలు మద్దతు ఇస్తూ ఘనంగా సన్మానిస్తూ.. అభిమానాన్ని చాటుతున్నారు. భవిష్యత్తులోనూ… వారి సేవలు ఇలాగే కొనసాగించాలని కోరుతున్నారు. వార్డు ప్రజలు, వ్యాపారుల మద్దతు, సహకారంతోనే తాము వార్డులో అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలు నిర్వహించగలిగామని వారన్నారు. తమను ఇన్నాళ్లూ ఆదరించిన వార్డు ప్రజలకు, అభిమానులకు కేసిరెడ్డి లావణ్య నర్సింహా రెడ్డి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజలు తమ సహకారాన్ని కొనసాగించాలని వారు కోరారు. వారు ఆశించినట్లుగానే ప్రజలు కూడా ఎన్నికలు ఏవైనా తమ వార్డులో గెలుపు మాత్రం కేసిరెడ్డి లావణ్య- నరసింహారెడ్డిదే అన్నట్లుగా ప్రజలు ఎదురుచూస్తూ ఉండడం చెప్పుకోదగ్గ విషయం.








