
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని పద్మనాయక కళ్యాణ మండపం నుండి ట్రస్మా బలపరిచిన అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు నామినేషన్ ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. సుమారుగా 3000 మంది పట్టభద్రులు 100 కార్లతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజుగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ట్రస్మ బలపరిచిన యాదగిరి శేఖర్ రావు నామినేషన్ వేసిన శుభ సందర్భంగా అన్ని జిల్లాల నుండి వచ్చిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ముకుమ్మడిగా యాదగిరి శేఖర్ రావుని ఎమ్మెల్సీగా గెలిపిస్తామని ప్రతిజ్ఞ పూనారు. శేఖర్ అన్న కోసం నేను సైతం అంటూ కతం తొక్కిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, టీచర్లు ఇది కామన్ మ్యాన్ కి కార్పొరేట్ మ్యాన్ కి జరుగుతున్న ఎలక్షన్స్ అని పట్టబద్రులు ఆలోచించి మీ ఆకిట్లో ఉండే వాడినని
పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి పట్టభద్రుల భవిత నిర్మాణానికి నాంది పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, సెక్రెటరీ ఐవి రమణరావు, ట్రెజరీ జయసింహగౌడ్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, కరీంనగర్ పట్టణ సెక్రటరీ బొమ్మ శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ పట్టణ ట్రెజరీ 33 జిల్లాల ట్రస్మా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ట్రెజరీలు, వైయస్సార్ యూత్ అధ్యక్షులు కేతన్ రావు, హర్షిత్ రావు, వెంకీ, నిఖిల్, అక్షయ్, అశోక్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు పాల్గొన్నారు.

















