
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్,ఫిబ్రవరి 15: బోయిన్ పల్లి మండలంలోని వివిధ గ్రామాలలో గల ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థుల అంతర్గత మూల్యాంకణ పర్యవేక్షణ బృందాలు సందర్శిస్తున్నాయి. అందులో భాగంగా శనివారం మండలంలోని కొదురుపాక, మాన్వాడ ,నర్సింగాపూర్, విలాసాగర్ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలను విలా సాగర్, వెంకటరావుపల్లి హై స్కూల్ హెచ్ఎం ,బృందం లీడర్ లు బొలగం శ్రీనివాస్, భూక్య తిరుపతి ఆధ్వర్యంలో టీం సభ్యులు చాడ నరోత్తం రెడ్డి, సయ్యద్ మోసిన్ అహ్మద్, నరేందర్ మక్బులు హుస్సేన్ పాఠశాలను సందర్శించి, పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులు రాసిన నాలుగు ఎఫ్ఎ మార్కుల సరాసరి , స్లిప్ టెస్ట్, ప్రాజెక్టు వర్క్, ఫేర్ నోట్ బుక్ రివ్యూ పరిశీలించి, దాని అనుగుణంగా అంతర్గత మార్కుల ను ఈ బృందం పరిశీలించింది. ఈ బృందానికి ఆయా పాఠశాల హెచ్ఎంలు ఉషారాణి, మిట్టపల్లి పర్శరాములు సంబంధిత అంతర్గత మార్కుల జాబితాలను అందజేసి వారికి సహకరించారు. ఈ సందర్భంగా పర్యవేక్షణ బృందం లీడర్ బొలగం శ్రీనివాస్, తిరుపతి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పట్టుదలతో చదువుతూ 10 ఫలితాల్లో మంచి మార్కులు సాధించి, జిల్లాలోనే బోయినపల్లి మండలాన్ని మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలని ఇందుకు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రణాళికతో ముందుకు కొనసాగాలని వారు కోరారు.

