
–హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఒక ప్రైవేట్ కంపెనీ తరఫున బ్యాంకాక్ టూర్ కి వెళ్ళిన వ్యాపారికి ప్రమాదం జరిగి అక్కడే చికిత్స పొందుతున్న వ్యక్తిని స్వదేశానికి తీసుకురావడానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కృషి చేశారు. వివరాల్లోకెళ్తే హుజురాబాద్ మండలం చేల్పూర్ గ్రామానికి చెందిన పుల్ల సృజన్ జమ్మికుంటలో దళిత బంధు పథకం కింద పెయింటింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. కంపెనీ ఇచ్చిన ఆఫర్ తో బిజినెస్ టూర్ నిమిత్తం బ్యాంకాక్ వెళ్లిన సృజన్ కు యాక్సిడెంట్ జరిగింది. తలకు బలంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం సృజన్ బ్యాంకాక్ లో ఉండడంతో సుజన్ సతీమణి స్నేహ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కలవడం జరిగింది. తన భర్తను బ్యాంకాక్ నుంచి హుజురాబాద్ కు రప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. వివరాలు తెలుసుకున్న కౌశిక్ రెడ్డి వెంటనే బ్యాంకాక్ వారితో పాటు బ్యాంకాక్ పంపించిన కంపెనీతో మాట్లాడారు. బ్యాంకాక్ నుంచి బాధితున్నీ హుజురాబాద్ కు రప్పించేందుకు అన్ని రకాల చర్యలను వెంటనే తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతమైన మాట్లాడుతూ బాధితునికి కంపెనీ నుంచి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ ఇప్పించాలని అన్నారు. భవిష్యత్తులో సృజన్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో సుజన్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చూపిన ఔదార్యానికి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు అభినందలు తెలిపారు.



