
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో జామ మస్జీద్ అధ్యక్షులు ముజాహిద్ అధ్యక్షతన ఆదివారం జరిగిన ఎన్నికలలో మస్జీద్ ఏ బషీర్ నూతన అధ్యక్షులుగా “షేక్ ఫయాజ్”ని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షుడిగా మొహమ్మద్ యాఖుబ్, సెక్రటరీగా మొహమ్మద్ అజ్మత్, జాయింట్ సెక్రటరీగా ఫారోక్, ఆర్గనైజషన్ సెక్రటరీగా యాఖుబ్, చీఫ్ అడ్వైజర్ గా రఫీ, కోశాధికారిగా మొహమ్మద్ నేహాల్, ఉపాధ్యక్షులుగా మొహమ్మద్ ఆరిఫ్, మొహమ్మద్ ఆఫ్సర్, గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ యాఖుబ్, మెంబర్స్ గా సాహెబ్ హుస్సేన్, నదీమ్, సమీర్, ఇస్మాయిల్, యాఖుబ్, మహామూద్, బాబా, యాఖుబ్ పాషా తదితరులను ఎన్నకోవడం జరిగిందనీ వారు తెలిపారు. కాగా ఈ నూతన కమిటీని జామి మసీద్ అధ్యక్షుడు ఎండి ముజాహిద్ ఘనంగా సన్మానించారు. నూతన కమిటీ మస్జీద్ యొక్క అభివృద్ధికి కృషి చెయ్యాలని సూచించారు.


మస్జీద్ ఏ బషీర్ నూతన పాలకవర్గం.. సన్మానిస్తున్న ముజాహిద్