
మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (కామారెడ్డి): కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి కామారెడ్డి జిల్లాలో పర్యటించి గెలుపు దిశగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నిరంతరం పోరాడుతానని, సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. గత 20 సంవత్సరాల నుండి ప్రైవేట్ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై పోరాటం చేస్తూ వాటిని సాధించినటువంటి ఘనత యాదగిరి శేఖర్ రావుది అని అన్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రచారంలో భాగంగా పలు ప్రైవేట్ పాఠశాలలో ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పటికే నిర్వహించిన పలు సంస్థల సర్వేల్లో యాదగిరి శేఖర్ రావు కి అనుకూలంగా ఉన్నాయని పలువరు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు మరియు కామారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు.










కామారెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటించి ఓటు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు.