
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి పనులపై బుధవారం జిల్లా అదనపు కలెక్టర్, పురపాలక సంఘ ప్రత్యేక అధికారి ప్రఫుల్ దేశాయ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పురపాలక సంఘము పరిధిలో జరుగుచున్న వివిధ అభివృద్ధి పనులను, ఆస్తి, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్, షాపుల కిరాయ వసూళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్చి 31లోగా పురపాలక సంఘమునకు బకాయ ఉన్న పన్నులను వసూలు చేయాలని సూచించారు. పట్టణములోని జమ్మికుంట రోడ్డు వెంట ఉన్న పంట కాలువ, మురికి కాలువలను పరిశీలించి వాటి పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనే విషయం చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కెoసారపు సమ్మయ్య, మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ఎన్ అశ్వినీగాంధీ, సీనియర్ సహాయకులు MD రషీద్, జె శ్రీకాంత్, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు ఆర్ సుధీర్, తూముల కుమార్ పాల్గొన్నారు.


