
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, ఫిబ్రవరి 19: ప్లాస్టిక్ వాడకంపై చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ మున్సిపల్ ప్రత్యేక అధికారి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కి ప్లాస్టిక్ పరిరక్షణ కమిటీ సభ్యులు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ ను విచ్చలవిడిగా వాడడం వల్ల ప్రజలు క్యాన్సర్ బారినపడుతున్నారని అన్నారు. 2022 చట్టం ప్రకారం ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పెషల్ అధికారి స్పందించినట్టు వారు తెలిపారు. అలాగే, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తెల్లరేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, నరసయ్య, ఆర్ఆర్ పతి, బత్తిని, సంజీవ్, ఎం రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.

