
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: చత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలు బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. పట్టణంలోని 27వ వార్డు, ఆరెవాడ, అహల్య నగర్ లో చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని శివాజీ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివాజీ వీర గాధలను ఆయన దేశభక్తిని పలువురు వక్తలు స్మరించుకున్నారు. హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన వ్యక్తులలో శివాజీ ముందుంటారని, మహిళలకు అత్యంత గౌరవం ఆయన ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, శివాజీ యూత్ సభ్యులు,ఆరె కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోకిలి శ్రీనివాస్, భూసారపు శంకర్, ఉపాధ్యక్షుడు అంగరిక శంకర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మొకిలి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి సురేందర్, కోశాధికారి రాజకుమార్, కార్యవర్గ సభ్యులు నరేష్, మొకిలి రాజన్న, బోర్నపల్లిలో అంగీరక సంపత్ రావు, ప్రసాద్, వెంకటేశ్వర్లు, మొగిలి, రాజన్న, బుచ్చన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


