
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అస్తిత్వం సేవా సంస్థ తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతిక శాఖ సౌజన్యంతో రాష్ట్రస్థాయి పురస్కారాల ప్రధానం 2025ను ఈనెల (శుక్రవారం) 21న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరగనున్న ఈ కార్యక్రమంలో అస్తిత్వం రాష్ట్ర అవార్డులు 2025ను తెలుగు భాష సాహిత్య పరిశోధనలో విభాగంలో భాగంగా హుజురాబాద్ కు చెందిన డాక్టర్ దివిటి అంజనీదేవికి అస్తిత్వం రాష్ట్ర అవార్డులు 2025ను బహూకరించనున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర సాహిత్య సాంస్కృతిక అంశాలపై పరిశోధన చేసి 2003వ సంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం నుండి డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ దివిటి అంజనీదేవి కృషికి గాను అస్తిత్వం రాష్ట్రస్థాయి పురస్కారాలలో తెలుగు భాష సాహిత్య పరిశోధనకు గాను అంజనీదేవికి ఈ అవార్డును ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డాక్టర్ కె రాణి రంజిత మాధురి మరియు తెలంగాణ ప్రభుత్వ బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ సంయుక్తంగా బహూకరించనున్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

