
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్( వంగర-
భీమదేవరపల్లి) ఫిబ్రవరి19: దైనందిన జీవితంలో ఎన్నో వ్యాపకాలతో సతమతవున్న ప్రజలకు ఉపశమనాన్ని కలిగించే అంశం ఆధ్యాత్మిక చింతన అని మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి.సోదరడు వంగర గ్రామ కైలాస కల్యాణి క్షేత్రం శాశ్వత చేర్మన్ పి.వి.మనోహర్ రావు అభిప్రాయపడ్డారు. వంగర కైలాస కళ్యాణి క్షేత్రంలో మంగళవారంనాడు రాత్రి గ్రామ పెద్దలు పాల్గొన్న సమావేశంలో ఆలయ పరిస్థితుల గురించి చర్చించారు.ప్రతిరోజూ ఉదయం సాయంత్రం స్థానిక దేవాలయాల సందర్శన వల్ల ఆధ్యాత్మిక చింతన కలుగుతుందన్నారు. గత ముప్ఫై సంవత్సరాల కాలంగా అహర్నిశలు ఆలయ అభివృద్ధికి శ్రమించడమే కాక ఆర్థిక వనరులను కూడా వెచ్చించిన సంగతి గుర్తుచేశారు. వయో భారం వలన ప్రతిసారీ వంగర గ్రామానికి వచ్చే అవకాశం లేనందున ఆలయ నిర్వహణ భాద్యతలు గ్రామస్థులు చేపట్టాలని కోరారు. అన్ని కులాలకు చెందిన పెద్దలతో రాజకీయాలకు అతీతంగా దేవాలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకొని దేవాలయ ప్రాశస్త్యం నలుదిశలా వ్యాప్తి చేయాలని మనోహర్ రావు కోరారు. శివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని గ్రామస్థులను కోరారు. గత యేడాదిన్నరగా సుమారు మూడున్నర లక్షల స్వంత వనరులను దేవాలయ అభివృద్ధికి ఖర్చు చేసినట్టు తెలిపారు. ఇందలో ప్రధానమైనవి టేకు డోర్లు,నీటి వసతి వాటర్ టాంకు, పైపులైన్ ,చెట్ల కొరకు డ్రిప్, దేవాలయం చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు లాంటివి ముఖ్యమైనవని తెలిపారు.
అంతకు ముందు సమావేశం ఉద్దేశాన్ని పి.వి.మదన్ మోహన్ వివరిస్తూ తొంభై సంవత్సరాల వయసులో కూడా గ్రామాభివృద్ధితో దేవాలయ అభివృద్ధి కాంక్షిస్తూ వారం రోజులుగా వంగరలో వుండి అభివృద్ధి కార్యక్రమాలు నాన్న గౌ.పి.వి.మనోహర్ రావు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వీరికి చేదోడుగా పి.వి.కిరణ్ కుటుంబానికి దూరంగా వంగరకు రావడం జరిగింది. అభివృద్ధి నిరంతరమని గ్రామస్థుల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఆలయ అభివృద్ధి మరింత క్రుషి చేయాలని కోరారు.మనం ఎంత సంపాదించిన దైవ చింతన కొరకు కొంత ఖర్చు చేస్తే మానసికంగా శాంతి లభిస్తుందని అన్నారు. కాబట్టి దేవాలయ అభివృద్ధికి ఆర్థిక హార్థిక చేయూత కోరారు. ఈ సందర్భంగా గ్రామస్థులు దేవాలయ అభివృద్ధికి నిరంతర క్రుషి చేస్తామని గ్రామస్థులు మనోహర్ రావుకి హామియిచ్చారు.
ఈ సమావేశంలో ఆర్.వెంకటరెడ్డి,రమేశ్,ప్రభాకర్,వెంకటేశ్వర్లు, సతీష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, అన్నారు చెప్యలా రాంచంద్రారెడ్డి, మారెం సతీష్, బుచ్చిరెడ్ఢి, మల్లారెడ్డి, మొండయ్య, చంద్రారెఢ్డి,లక్ష్మీనారాయణ, ప్రభుతులు పాల్గొన్నారు.

