
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
ఉన్న డబ్బును కాపాడుకోవడానికో ఆస్తులు పెంచుకోవడానికి ఎమ్మెల్సీ గా పోటీ చేయడం లేదని సేవ చేయడానికి ముందుకు వచ్చాను ఆశీర్వదించండి అని కరీంనగర్ మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్స్ తో కలిసి ప్రచారo నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక క్యాపిటల్ మ్యానుకు, కామన్ మ్యాన్ కు మధ్య జరుగుతుందని అన్నారు. కొంతమంది తాము సంపాదించిన కోట్లాది డబ్బుకు రక్షణ కల్పించడం కోసం రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తున్నారని మరికొందరు సేవా దృక్పథంతో పోటీ చేస్తున్నారని అన్నారు పట్టభద్రులు ప్రజలు వాస్తవాలు గ్రహించి నిజాయితీపరుడికి సేవ గుణం ఉన్నవాడిని ఎన్నుకోవాలని కోరారు. సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఎన్నికలను కలుషితం చేస్తున్న అభ్యర్థులకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. సేవ లక్ష్యంతో ముందుకు వస్తున్న తనకు అనేకమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు పలుకుతున్నారని ఇది శుభ పరిణామం అని అన్నారు. కొంతమంది వ్యక్తుల వల్ల రాజకీయాలంటేనే డబ్బు మయమనే అభిప్రాయం ప్రజల్లో నాటు కోల్పోయిందని దీన్ని మార్చడానికి తాను ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వందలాది ట్రస్మా సంఘంలోని పాఠశాలలన్నీ తనకు మద్దతు ప్రకటిస్తున్నాయని అన్నారు. గత కరోనా సమయంలో ప్రవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు 25 కిలోల బియ్యం రెండు వేల రూపాయల నగదు ప్రభుత్వం నుండి తాను ఇప్పించిన విషయం ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు మరిచిపోలేదని ఎక్కడికి వెళ్లినా తనకు గుర్తు చేస్తున్నారని చేసిన మేలు గుర్తుంచుకుంటామని చెబుతున్నారని అన్నారు. తాను ఎమ్మెల్సీగా విజయం సాధిస్తే తనకు వచ్చే జీతాన్ని ప్రతినెల ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుందని దీనిని బాండ్ పేపర్లో రాసి ఇచ్చానని అన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలకు ఆరోగ్యకరమైన పోటీకి చిరునామాగా నేనున్నానని పట్టభద్రులు నమ్మకంతో గెలిపించాలని కోరారు. అనంతరం జమ్మికుంట రోడ్డు బస్టాండ్ కరీంనగర్ రోడ్డు లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రచార నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా మండల అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు బద్దుల రాజకుమార్, పా రెడ్డి రవీందర్ రెడ్డి, దాసరి కోటేశ్వర్ విన్సెంట్ జార్జ్, షాజు తామస్, మాడిశెట్టి ప్రసాద్, ఏనుగు మహిపాల్ రెడ్డి, తౌటం గోపాల్ విజయపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు







