
మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(బోయిన్ పల్లి): హంసనీతి శతకము పుస్తకమును గురువారం బోయినిపల్లి మండల కేంద్రంలో మండల విద్యాధికారి శ్రవణ్ కుమార్ విలాసాగర్ హై స్కూల్ హెచ్ఎం బొలగం శ్రీనివాస్, బోయినిపల్లి హై స్కూల్ హెచ్ఎం కొను భూమయ్యతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొలనూరులో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఈ పుస్తకం రచించిన గుర్రం అంజయ్యను అభినందించారు. శతకంలో కవి సంగానీతి, రీతులను కవి చక్కగా వివరించారని విద్యార్థులకు ఉపయోగపడేలా ఉందని అతిథులు ప్రశంసించారు. గుర్రం అంజయ్య రానున్న రోజుల్లో మరెన్నో పుస్తకాలను విద్యార్థుల భవిష్యత్తు కోసం రచించి మంచి గుర్తింపు పొందాలని హెచ్ ఎం బొలగం శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బోయినిపల్లి, తంగళ్లపెల్లి, ఇల్లంతకుంట మండలం తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


