
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్ (సిద్దిపేట):విద్యను వ్యాపారం చేయలేదని సర్వీస్ చేస్తున్నానని మార్పు కోసం వస్తున్న తనను ఆశీర్వదించండి అని పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు అన్నారు. శుక్రవారం రోజు సిద్దిపేట ప్రెస్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రతినిధులు తన గెలుపు కోసం వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. బిజినెస్ చేసేవారు తన లాభం కోసం చూస్తారు గాని నిస్వార్ధంగా సేవ చేయలేరన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను కాదని వేలకోట్ల సంపాదించే కార్పోరేట్ వ్యక్తులకు పార్టీ టికెట్లు ఇచ్చి పార్టీలో కార్యకర్తలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. నేడు 40 మంది ఉన్న శాసనమండలిలో ఎలాంటి చర్చ జరుగుతా లేదన్నారు. తనను గెలిపిస్తే 6 సంవత్సరాలలో ప్రతి నెల జీతం ఒక్కొక్క మండలానికి ఇచ్చి రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచితంగా కోచింగ్ ఇచ్చి పట్టభద్రుల అభివృద్ధికి దోహదపడతానని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు వేల కోట్ల రూపాయలతో ఎన్నికలకు వస్తున్నారని పట్టబద్రులు ఆలోచించాలన్నారు. పట్టభద్రులను ఓటు అడిగే నైతిక విలువ లేని వారు కూడా ఈరోజు ఓట్లు అంటూ వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కయని అన్నారు. 272 మండలాలు తిరిగిన వ్యక్తి తానని ప్రతి వారి సమస్యను తెలుసుకున్నానని ముఖ్యంగా జూనియర్ లాయర్లకు స్టైఫండ్ ఇచ్చేలా కృషి చేస్తానని, ప్రైవేట్ టీచర్లకు ఐదు లక్షల ఆరోగ్య భీమా, ఐదు లక్షల ఇన్సూరెన్స్ వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని ఇప్పుడు రియంబర్స్మెంట్ రాక చాలామంది విద్యార్థులు చదువును కొనసాగించలేక పోతున్నారని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ లకు సంబంధించిన నిధులు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా పత్రిక సోదరులకు ఇస్తానన్న హామీలు కూడా తుంగలో తొక్కారని తనను అధిక మెజారిటీతో గెలిపిస్తే పత్రిక విలేకరులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కావచ్చు వాళ్ళ పిల్లల చదువుల్లో రాయితీలను కావచ్చు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. ఉన్న డబ్బును కాపాడడానికి ఆస్తులు పెంచుకోవడానికి ఎమ్మెల్సీగా పోటీ చేయడం లేదని సేవ చేయడానికి మీ ముందుకు వచ్చానని ఆశీర్వదించండి అని అన్నారు. ఈ ఎలక్షన్లు ముఖ్యంగా కామన్ మ్యాన్ కు కార్పొరేట్ మ్యానుకు మధ్య జరుగుతుందని చెప్పారు. పార్టీలను చూసి గాని కులాలను చూసి గాని ఓట్లు వేయకండి, సేవా గుణం ఉన్న వ్యక్తిని నేనని అన్నారు. కొంతమంది వ్యక్తుల వల్ల రాజకీయాలంటేనే డబ్బు అనే అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయిందని దీన్ని మార్చడానికి తాను ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వందలాది ట్రస్మా సంఘంలోని పాఠశాలలన్నీ తనకు మద్దతు ప్రకటిస్తున్నాయని అన్నారు. గత కరోనా సమయంలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు 25 కిలోల బియ్యం రెండు వేల రూపాయల నగదు ప్రభుత్వం నుండి తాను ఇప్పించిన విషయం ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు మరిచిపోలేదని ఎక్కడికి వెళ్లినా తనకు గుర్తు చేస్తున్నారని చేసిన మేలు గుర్తుంచుకుంటామని చెబుతున్నారని అన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలకు ఆరోగ్యకరమైన కోటికి చిరునామాగా నేనున్నానని పట్టభద్రుడు నమ్మకంతో గెలిపించాలని కోరారు. సిద్దిపేటలోని వివిధ పాఠశాలలోని పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ట్రస్మా అధ్యక్షులు నాగిని నరసింహారెడ్డి, ట్రెజరరీ శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుభాష్, శైలేందర్ జిల్లా ఉపాధ్యక్షులు, కే నారాయణరెడ్డి, రాష్ట్ర సలహాదారు మరియు ట్రస్మా భాద్యులు పాల్గొన్నారు.










సిద్దిపేటలోని వివిధ పాఠశాలలోని పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్న పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు