
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టిఎస్కేసి ఆధ్వర్యంలో యూజీసీ మార్గదర్శకాలు, నూతన నిబంధనలు అనే అంశంపై శుక్రవారం వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగము సహాయ ఆచార్యులు డాక్టర్ జి శ్రీరామలు మాట్లాడుతూ భారత దేశంలో విశ్వవిద్యాలయ స్థాయి విద్యాభివృద్ధికి కోసం ఏర్పాటైన యూజిసి కాలానికి అనుగుణంగా అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి ప్రొఫెసర్ గా, సీనియర్ ప్రొఫెసర్ గా మారుటకు పదోన్నతి పొందుటకు ఆచరించ వలసినటువంటి విధానాలను, అలాగే విద్యార్థులు కేంద్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందే మార్గాలు, కోర్సులు స్కాలర్షిప్స్, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ వర్క్ షాప్ లో ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరాదేవి, డాక్టర్ ఓదెలు, లింగారెడ్డి, డాక్టర్ రేణుక, డాక్టర్ నరేందర్, డాక్టర్ మహిపాల్ రెడ్డి డాక్టర్ సుమలత, డాక్టర్ ఝాన్సీరాణి, డాక్టర్ స్వప్న, మంగమ్మ, రమ పల్లవి, శ్రీధర్, విద్యార్థులు పాల్గొన్నారు

