
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగిన ఉపాధి హామీ పనులకు సంబందించి 15వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం ఇన్ హౌస్ ను హుజురాబాద్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు హుజూరాబాద్ మండలంలోని 19 గ్రామపంచాయితీలలో దాదాపు 5 కోట్ల రూపాయల పేమెంట్లు చేశారు. ఈ నగదుకు సంబంధించి గత రెండు వారాలుగా సామాజిక తనిఖీ బృందం గ్రామాలలో పర్యటించి, తనిఖీ నిర్వహించి కొలతలో వచ్చిన తేడాలను గుర్తించి, శుక్రవారం జరిగిన ఇన్ హౌస్ కార్యక్రమంలో వివరాలు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన డీఆర్డీవో(జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి) శ్రీధర్ అన్ని అంశాలను పరిశీలించి, బాధ్యులపై తేడా వచ్చిన నగదు రికవరీకి ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీడీ కృష్ణ, క్వాలిటీ కంట్రోల్ అధికారి , ఎస్ఆర్పీ సుశీల, ఎంపీడీవో సునీత, ఎంపీవో సతీష్, ఏపీవో చంద్రశేఖర్, సాంకేతిక సహాయకులు రాజేందర్ , రమ, సోషల్ ఆడిట్ డిస్ట్రిక్ రిసోర్స్ పర్సన్స్, అన్ని గ్రామాల పంచాయితీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.


