
–జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి మహమ్మద్ ముజహిద్ హుస్సేన్ విజ్ఞప్తి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం కలెక్టర్ పమేలా సత్పతిని హుజురాబాద్ డివిజన్ మస్జీద్ అండ్ ఈద్గా, కబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కలిసి వచ్చే నెల పవిత్ర రంజాన్ మాసం తేదీ అనగా 2-3-2025 నుండి ఏప్రిల్ మొదటివారం వరకు రంజాన్ నెల ఉపవాసాలు కొనసాగుతాయి కనుక రంజాన్ ఉపవాసాలు ప్రారంభం అవుతున్నందున హుజురాబాద్ డివిజన్ లో ఉన్న అన్ని మసీదులకు, ఈద్గాలకు, కబ్రుస్థాన్ లలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరారు. పరిశుభ్రత చేయుటకు హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలతో పాటు ఇల్లందకుంట, కేశవపట్నం, సైదాపూర్, వీణవంక గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మసీదులలోని చుట్టుపక్కలలో పరిశుభ్రత చేయించటం, నీటి సౌకర్యం కల్పించడం మరియు మసీదులలో మున్సిపల్ మరియు గ్రామాలలోని మస్జిద్ లలో గ్రామ పంచాయతీల ద్వారా ప్రతిరోజు వాటర్ ట్యాంక్ ల ద్వారా నీటి సరఫరా చేయించడం, మస్జిద్ ఆవరణలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించటం, ఈద్గా కబ్రిస్తాన్లో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించడం చేపట్టాలన్నారు. మరియు పండుగ రోజు ఈద్గాల వద్ద వాటర్ ట్యాంకర్, పండల్స్, సౌండ్ సిస్టం, కలరింగ్ మరియు మసీదుల చుట్టూ తాత్కాలిక లైటింగ్ లాంటి సదుపాయాలు కల్పించేలా మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులకు, రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు కనుక విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హుజురాబాద్ పట్టణంలో ముస్లిం సోదరులకు ఒకటిన్నర ఎకరాల కబ్రిస్తాన్ స్థలం కేటాయించడం జరిగిందని, దాని హద్దులు సర్వే ల్యాండ్ అధికారులచే సర్వే చేయించి హుజురాబాద్ మస్జిద్ కమిటీ వారికి భూమి ధ్రువీకరణ పత్రాలు అప్పగించాలన్నారు. సైదాపూర్ మండలంలోని ఎలాబోతారం గ్రామానికి చెందిన ముస్లిం కబ్రస్తాన్ 8 గుంటల స్థలంలో ఓ వ్యక్తి కబ్రస్థాన్ స్థలాన్ని ఆక్రమించుకోవడంతో కబరస్తాన్ లోని సమాధుల వద్ద వెళ్లే దారి లేక ఇబ్బంది పడుతున్నారని కావున ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కి విజ్ఞప్తి చేశారు.

