
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సైదాపూర్ మండలంలోని ఎలాబోతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని 24 మంది విద్యార్ధినీ విద్యార్థులకు శనివారం రోజున స్పోర్ట్స్ యూనిఫామ్ వితరణ చేశారు. హుజురాబాద్ లోని కాకతీయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మారబోయిన వేణుమాధవ్ తన అమ్మ, నాన్న మారబోయిన లక్ష్మీ – మల్లయ్యల జ్ఞాపాకార్థం వితరణ చేసారని తెలిపారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మల్గారెడ్డి జ్యోతిరాణి, ఉపాధ్యాయుడు నాగిరెడ్డి శ్రీనివాసారావు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

