
–పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డినీ గెలిపించండి.
–ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ అభివృద్ధి చేస్తే,బీజేపి ప్రైవేటీకరణ చేస్తూ నిర్వీర్యం చేస్తుంది.
–నరేందర్ రెడ్డి గెలుపు సామాన్యుని గెలుపు.
–త్వరలో హుజురాబాద్ కు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షయల్ పాఠశాల.
–అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంలో బీజేపీ టాప్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ పేర్కొన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు సామాన్య మానవుని విజయమని, తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేయడంలో బీజేపీ టాప్ లో ఉందని, విజయపథంలో ముందున్నం కాబట్టే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. పదేళ్ల బీజేపీ,బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, 2014 ఎన్నికల సమయంలో యాడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ మోడీ ప్రభుత్వం 11ఏళ్లలో 2లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన యాడాదిలో 55,000 వేల ఉద్యోగాలు ఇచ్చామని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదని, గతంలో ఉద్యోగుల జీతాల విషయంలో అవస్థలు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి తారీఖున జీతాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను కాంగ్రెస్ అభివృద్ధి చేస్తే,బీజేపి వాటిని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. పట్టభద్రుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని, బీజేపి పార్టీ తెలంగాణకు బడ్జెట్ లో అన్యాయం చేసిందనీ 8 మంది ఎంపీలు ఉన్నా బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని, బీజేపి,బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నాయని అన్నారు. ఫీజ్ రెంబర్స్మెంట్ ద్వారా అనేక మంది పట్టభద్రులుగా మారారని గుర్తు చేశారు. ట్యూషన్ చెప్పుకునే సాధారణ స్థాయి నుండి విద్యావేత్తగా ఎదిగిన నరేందర్ రెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీ ఇవ్వాలని,పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, శాసన మండలిలో బలంగా కొట్లాడతరని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిచిన జిల్లా కేంద్రంలో గ్రాడ్యుయేట్ భవన్ నిర్మిస్తానని తెలిపారు. త్వరలో హుజురాబాద్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షయల్ స్కూల్ మంజూరు చెపిస్తున్నామని అన్నారు. రానున్న మూడు నెలల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



