
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఆదిలాబాద్ – మెదక్ – నిజామాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డికి గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
గెస్ట్ లెక్చరర్ల సంఘం ఏకగ్రీవ నిర్ణయం
ధర్మపురిలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశమై, నరేందర్ రెడ్డిని మద్దతు పలకాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై, నరేందర్ రెడ్డికి మద్దతు లేఖ అందజేశారు.
గెస్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారంపై హామీలు
ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ,
గత ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. 11 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా గెస్ట్ లెక్చరర్లుగా పని చేస్తున్న వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు.
నరేందర్ రెడ్డి మాట్లాడుతూ,
జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, వేతనాలు పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది ఆటో-రిన్యూవల్ విధానం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లతానన్నారు. 11 ఏళ్లుగా శ్రమదోపిడికి గురవుతున్న గెస్ట్ లెక్చరర్లకు న్యాయం చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి 27న నరేందర్ రెడ్డికి మీ ప్రాధాన్యత ఓటు
గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామేర ప్రభాకర్ మాట్లాడుతూ…ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్లు ఫిబ్రవరి 27న నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి” అని పిలుపునిచ్చారు. మరియు ఇతర పట్టభద్రులను కూడా నరేందర్ రెడ్డిని గెలిపించేలా ప్రోత్సహించాలి” అని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, బండి కృష్ణ, రామకృష్ణ గౌడ్, శ్రీవిద్య, నవమణి, వీణ, రాధిక తదితరులు పాల్గొన్నారు.




