
–స్వతంత్ర అభ్యర్థిగా పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీలో ఉన్న
సంఘసంస్కర్తగా గెలిపించాలని కోరుతున్న..
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (నిజామాబాద్): కామన్ మెన్ తో బిజినెస్మేన్లు పోటీ లో ఉన్నారని, సంఘసంస్కర్తగా సమాజ సేవను గుర్తించండి అని స్వతంత్ర అభ్యర్థిగా పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీలో ఉన్న తనను ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు కోరారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ ట్రస్మా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ట్రస్మా సంఘంలో తన వంతు విధులు నిర్వహించి ప్రైవేట్ పాఠశాలలను పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల అన్ని రకాల సమస్యలను పరిష్కరించడం జరిగింది. విపత్కర పరిస్థితులలో ఉన్న ప్రైవేట్ విద్యారంగంలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ఆపత్కార భృతి మూడు నెలలు రాష్ట్ర మొత్తంలో రెండున్నర లక్షల ఉపాధ్యాయులకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని చొప్పున అందజేయడం జరిగిందన్నారు. మానవయ్య విలువలను పెంపొందించడానికి స్థాపించిన ప్రజ్ఞా సంస్థకు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశానని ప్రజ్ఞా వికాస్, ఇతర సంస్థలతో కలిపి పట్టభద్రుల వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని వివరించారు. సేవా కార్యక్రమంలో భాగంగా 2000 మంది విద్యార్థులకు జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలలో ప్లీజ్ రాయికి ఉచితంగా అడ్మిషన్లను ఇప్పించాను. కలమడుగు పాఠశాలను దత్తత తీసుకొని గత పది సంవత్సరాలుగా ప్రతి విద్యార్థినికి ఉచితంగా రాత పుస్తకాలు అందించాను అదే విధంగా పాఠశాలకు త్రాగునీటి సదుపాయం కోసం ఆరో ప్లాంట్లను ఇప్పించాను. 3000 మందికి పైగా విద్యార్థులకు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలను గుర్తించడం జరిగింది. విద్య హక్కు చట్టం ప్రకారం 25% పేద విద్యార్థులకు ఉచిత విద్య కొరకు ప్రభుత్వం ద్వారా రియంబర్స్మెంట్ వచ్చేలా కృషి చేస్తాను. మోడల్ స్కూల్ టీచర్స్ కి 010 ద్వారా వేతనాలు అందజేసి కారుణ్య నియామకాలు చేపట్టేలా కృషి చేస్తానన్నారు. గురుకుల టీచర్స్ కి మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ, 12 నెలల వేతనంతో కూడిన ఉద్యోగ భద్రత కల్పించేలా కృషి,ప్రైవేటు ఉపాధ్యాయులకు కనీస వేతన చట్టం, ఉద్యోగ భద్రత కల్పించి వారికి సంరక్షణ చట్టం తీసుకురావడానికి కృషి, కేజీబీ ఉపాధ్యాయులకు ఎస్ ఎస్ఏ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేస్తూ సర్వీస్, రెగ్యులరైజ్ చేసేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో చిన్న డిఏ మరియు పీఆర్సీలను అమలు అయ్యేలా కృషి, సి.పి.ఎస్ రద్దు కొరకు కృషిచేసి ఓ.పి.ఎస్ విధానాన్ని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తానన్నారు. 41 సి.ఆర్.సి. సి చట్టంలో సవరణ చేసేందుకు కృషి చేస్తాను. జూనియర్ లాయర్స్ కి స్టిఫండ్ వచ్చేలా ప్రయత్నం చేస్తానన్నారు. ప్రైవేటి పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది, జర్నలిస్టులకు ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరుకు ప్రయత్నిస్తాను.అసంఘటితముగా ఉన్న అన్ని రంగాల ప్రైవేట్ ఉద్యోగుల కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇప్పించుటకు కృషి చేస్తాను.ప్రైవేట్ ఉద్యోగులందరికీ 61 సంవత్సరాలు పూర్తయిన వెంటనే జీవన భృతి పెన్షన్ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వాన్ని ఒప్పిస్తాను.
అన్ని రంగాలలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి అందేలా చూస్తాను. కి కృషి చేస్తాను మరియు వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటాను అర్హులైన నిరుద్యోగులందరికీ వివిధ వృత్తి విద్య కోర్సులలో కంప్యూటర్ రంగాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తాను అని తెలియజేశారు.నిరుద్యోగుల కొరకు ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసేలా కృషి చేస్తాను ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను సూచించే విధంగా ఉద్యోగ క్యాలండర్ రూపకల్పనకు కృషి చేస్తానన్నారు.ప్రతి జిల్లా మండల కేంద్రాలలో ఉన్న లైబ్రరీల బలోపేతానికి కృషి, వివిధ వ్యాపారాలకు మరియు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థికంగా నిలదొక్కుకొనుటకు ప్రభుత్వ సబ్సిడీతో దీర్ఘ మద్యకాళిక రుణాలు మంజూరు చేయిస్తాను అని అన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతన సవరణ ఉద్యోగ భద్రత కల్పించేలా కృషి,న్యాయవాదుల వైద్యుల, బ్యాంకు ఉద్యోగుల, సింగరేణి ఉద్యోగుల, కార్మికుల, ఆర్టీస్ ఉద్యోగుల, మున్సిపాలిటీ ఉద్యోగుల, వ్యాపారుల మరియు వివిధ రంగాలలోని వారి సమస్యల పరిష్కారానికి కృషి,విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య కొరకు ప్రభుత్వం ద్వారా రియంబర్స్మెంట్ వచ్చేలా కృషి,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ప్రభుత్వ విద్యా రంగంలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టి పక్కా ప్రణాళికలతో నాణ్యమైన నైపుణ్యమైన విలువలతో కూడిన విద్య అందేలా శాయాశక్తుల కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం పట్టభద్రుడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎన్నికల్లో గెలిచేందుకు కోట్ల రూపాయలను ఖర్చులు చేస్తున్నారన్నారు. ఈ విషయమై ఎన్నికల అధికారికి ఫిర్యాదు సైతం చేస్తామని తెలిపారు. బిజినెస్మేన్లుగా ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బిజినెస్మేన్ గానే వ్యవహరిస్తారని సర్వీస్మెన్ గా పనికిరారని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు గమనించి సేవ చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్రులు తనను ఆశీర్వదించి సీరియల్ నెంబర్ 47 లో ఉండే యాదగిరి శేఖర్ రావు పేరు ముందు అంకెల్లో ఒకటి రాసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర కోశాధికారి జయ సింహా గౌడ్, జిల్లా అధ్యక్షులు నిత్యానందం, ప్రధాన కార్యదర్శి అరుణ్, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నరసింహారావు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్, నారాగౌడ్, పాఠశాల శ్రీనివాస్, నగేష్, పృద్వి తదితరులు పాల్గొన్నారు.
