
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: హైదరాబాద్ జింఖానా గ్రౌండ్లో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ గేమ్స్ పోటీలలో పాల్గొన్న జమ్మికుంట మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) కు గత సంవత్సరం జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో అత్యంత ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన సందర్భంగా ప్రభుకు 2025 సంవత్సరంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ అవార్డును
సుప్రీం కోర్టు న్యాయవాది చేతుల మీదుగా అందుకున్నారు.
ప్రభు ను ఈ అవార్డు ఎంపిక చేసి, ప్రోత్సహించిన
తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై రామారావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుకు ప్రయిడ్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ అవార్డు రావడం పట్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.





అందుకున్నా అవార్డుతో క్రీడాకారుడు ఆంబాల ప్రభాకర్ (ప్రభు)