
హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు విజ్ఞప్తి.. జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ఉన్న 5 మసీదుల వద్ద రంజాన్ మాసం సందర్భంగా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ముస్లింలు సోమవారం సాయంత్రం వినతిపత్రం అందజేశారు. విధి దీపాలు, పరిసరాలు పరిశుభ్రతగా ఉంచాలని, బీజింగ్ పౌడర్, ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరా, ఈద్గా ఆవరణములు ముస్లింల సమాధుల వద్ద తుమ్మ చెట్లను తొలగించి, గడ్డిని పిచ్చి చెట్లను అన్నిటిని తొలగించి శుభ్రముగా చేపట్టాలన్నారు. రంజాన్ పండుగ ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ఈద్గా ఆవరణములో మంచినీటి సరఫరా, పెండల్స్ సౌండ్ సిస్టమ్స్, ఈద్గా ఆవరణములో కలరింగ్, కూలర్స్ ఇవి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను కలిసి జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు మహమ్మద్ రఫిక్ మున్ను మహమ్మద్ హబీబ్ మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ యాసిన్ ఖాన్, అరిషత్ జమీల్, మక్కా మసీద్ అధ్యక్షులు సయ్యద్ అజీమ్ తదితరులు కమిషనర్ సమ్మయ్యను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ హుజురాబాద్ జామీ మజీద్ ఈద్గా కబ్రిస్తాన మేనేజ్మెంట్ కమిటీ తరఫున ఒక రిప్రజెంటేషన్ అందజేశారు. మీ యొక్క సమస్యల పరిష్కారం కొరకు నా వంతు నేను నా సిబ్బందితో కలిసి కృషి చేస్తామని కమిషనర్ సమ్మయ్య జామి మజీద్ కమిటీకి హామీ ఇచ్చినారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

