
Oplus_131072
–రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటాయించాలి.
–PDSU రాష్ట్ర కోశాధికారి కూతాటి రాణా ప్రతాప్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని, కార్పోరేట్ శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని PDSU రాష్ట్ర కోశాధికారి కూతాటి రాణా ప్రతాప్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలోని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర కోశాధికారి కూతాటి రాణా ప్రతాప్ మాట్లాడుతూ….రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 15 నెలల గడుస్తున్న ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వలేదని అన్నారు. విద్యార్థులకు ఇవ్వవలసిన 8500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు విడుదల కాక పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రీజనల్ రింగ్ రోడ్లు, మూసి ప్రక్షాళన పేరిట తక్షణవసరం లేకున్నా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువు కోసం డబ్బులను విడుదల చేయకపోవడం దారుణం అన్నారు. ఈ చర్యతో పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20% శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేక కొట్టు మిట్టాడుతున్నాయని విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని అన్నారు. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలనీ, యూనివర్సిటీ ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. విద్యాశాఖకు మంత్రిని ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు దోపిడీ జరుగుతుందని, వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటినుండే అడ్మిషన్ల ప్రక్రియను నిబంధనలను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారని ఆ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం శ్రీ చైతన్య విద్యా సంస్థలో చనిపోయిన డేగల యోగా నందిని కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ ను వెంటనే అరెస్టు చేయాలని, వారి విద్యా సంస్థల సిబిఐతో విచారణ చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కాంసారపు రవితేజ, ఎండీ అస్లాం, కొయ్యడ బాబు, రాకేష్, శేఖర్, అంజి తదితరులు పాల్గొన్నారు.
