
Oplus_131072
–గ్రాడ్యుయేట్ మేనిఫెస్టో బుక్లెట్ ను ముఖ్యమంత్రికి అందించిన వెలిచాల ..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వెలిచాల రాజేందర్ రావు రూపొందించిన గ్రాడ్యుయేట్ మేనిఫెస్టోలో మంచి విజన్ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో సోమవారం సాయంత్రం పట్టభద్రుల సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను స్వయంగా రూపొందించిన గ్రాడ్యుయేట్ మేనిఫెస్టో బుక్ లెట్ ను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా మేనిఫెస్టో బుక్ లెట్ ను ముఖ్యమంత్రి ఆసక్తిగా చదివారు. ఈ సందర్భంగా మేనిఫెస్టో చాలా బాగుంది.. మంచి విజన్ తో రూపొందించారు..పట్టభద్రుల ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ మ్యానిఫెస్టో ఒక రోడ్డుమ్యాప్ ల ఉపయోగపడుతుందనీ వెలిచాల రాజేందర్ రావును ప్రశంసించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నందుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. రాజేందర్ రావు రాజకీయాల్లో వినూత్నమైన, నూతన ఒరవడిని సృష్టించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మేనిఫెస్టోలో రూపొందించిన అంశాలను తమ ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందని రాజేందర్ రావుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో రూపొందించిన ప్రతి అంశం పట్టభద్రులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో వాటన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ తను స్వయంగా రూపొందించిన పట్టభద్రుల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చదివారని పేర్కొన్నారు. ఇందులో మంచి విజన్ ఉంది వీటిపై అధ్యయనం చేసి అమలు చేసే విషయం పరిశీలిస్తామని పేర్కొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి తన మేనిఫెస్టోను గుర్తించి అభినందించడం గర్వంగా ఉందని రాజేందర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపులో తన పాత్ర ప్రముఖంగా ఉండేందుకే మేనిఫెస్టోను రూపొందించానని తెలిపారు. ఈ మేనిఫెస్టో కాపీని ప్రతి పట్టభద్రుడికి అందించేలా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. ఇందులో రూపొందించిన అంశాలపై పట్టబద్రులు ఆసక్తి చూపిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలనే ఆలోచనలో పట్టభద్రులు ఉన్నారని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు, నాయకులందరికీ మేనిఫెస్టో కాపీలను అందజేశానని రాజేందర్రావు తెలిపారు.
