
Oplus_131072
–ఎన్నికల కమిషనర్ , రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారు – సర్ధార్ రవీందర్ సింగ్
–ఎవరికి ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీకి వేసినట్లే – సర్దార్ రవీందర్ సింగ్
–పెట్టుబడిదారులకు రాజకీయ్యల్లోకి వచ్చే అవసరం ఏముంది – సర్ధార్ రవీందర్ సింగ్
–ఉద్యమ సమయంలో నాలుక తప్పించి .. శరీరం మొత్తం దెబ్బలు తిన్నా – సర్ధార్ రవీందర్ సింగ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(సిద్దిపేట): పెట్టుబడిదారులకు రాజకీయ్యల్లోకి వచ్చే అవసరం ఏముందని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్, కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరణ చేసి స్మార్ట్ సిటీ దిశగా అడుగులు వేసి అనేక అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు చేశామన్నారు. కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో తనపై కుట్రలు భారీగా జరిగాయంటూ మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని హైకోర్టును ఆశ్రయిస్తే విచారణకు ఆదేశించారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ డబ్బుల కట్టలతో టికెట్ తెచ్చుకున్నవారే అని సర్ధార్ రవీందర్ సింగ్ గారు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసిన వేసిన కాంగ్రెస్ ఖాతలోకే పోతుందని , పట్టభద్రులు మోసపోవద్దని హెచ్చరించారు.
ఉద్యమకరుడిగా ఎన్నో అరెస్టుల అదరకుండ … బెదిరింపులకు బెదరకుండా ..ఎప్పుడు పడితే అప్పుడు పోలీసులు వాళ్ళు ఇబ్బందులు పెట్టిన కూడా ఇన్నేళ్లుగా ప్రజాక్షేత్రంలో అండగా నేనున్నని గుర్తుచేశారు. పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా మీ సమస్యలు పట్టించుకున్నారా ? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి ప్రసన్న హరికృష్ణని బీఆర్ఎస్ పార్టీలో చేరమని పంపించారని తనకు బీ ఫాం రాకుండా కుట్రలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.
నాలుగు నెలల క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వదని చెప్పిన వీడియో వైరల్ గా మారిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీతో ప్రసన్న హరికృష్ణ గారికి ముందునుంచే సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు విద్య వ్యాపారం, పుస్తకాల వ్యాప్తర స్వలాభం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు మీకోసం ఏనాడైనా ధర్నాలు రాస్తారోకోలు దీక్షలు నిరసనలు చేశారా? అంటూ ప్రశ్నించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ప్రజల ఆశీర్వాదంతో నేను పోటీ చేసిన ప్రతి ఎన్నికలలో విజయం సాధించానని గుర్తుచేశారు. నా పై అక్రమంగా కుట్రలు చేస్తున్నారని నామినేషన్ వేసే సమయంలో కూడా మా వాహనాలను అడ్డగించి …మంత్రుల వాహనాలను లోపలికి అనుమతించడం పట్ల ఫిర్యాదు చేస్తే ఎన్నికల నిబంధనలు పాటించని వారిపై ఇంకా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
కేవలం తన పేరు సీరియల్ నెంబర్ లో ముందు వరుసలో రావాలని కుట్రలు చేసి నరేందర్ రెడ్డి పేరును అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిగా మార్పులు చేసి అన్యాయం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఓటరు వివరాలు బహిర్గతం చేస్తున్నారని పూర్తి ఆధారాలతో బట్టబయలు చేశారని కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఓటరు వివరాలను బహిర్గతం చేసే vnrmlc.com అనధికార వెబ్‌సైట్‌పై భారత ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశానని చెప్పారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 21 ప్రకారం గోప్యతా చట్టాలు మరియు ఎన్నికల డేటా భద్రతను తీవ్రంగా ఉల్లంఘించడాన్ని www.vnrmlc.com అనే వెబ్సైట్, వారి పేరు మరియు మొబైల్ నంబర్ని ఉపయోగించి గ్రాడ్యుయేట్ ఓటరు వివరాలను వెతకడానికి వినియోగదారులను చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న పూర్తి ఓటరు వివరాలు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వెబ్సైట్ లో ఏలా పొందుపరచారని ప్రశ్నించారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ రాజ్యాంగ నిబంధలను పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓటరు జాబితాను అధికారులు ఏ విధంగా అనధికార వెబ్సైట్ కు అందించారో వివరించాలని ధ్వజమెత్తారు. ఇది సున్నితమైన ఓటరు వివరాలను బహిర్గతం చేస్తుంది, గుర్తింపు చౌర్యం, ఎన్నికల మోసం మరియు రాజకీయ ప్రయోజనాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదానికి దారి తీస్తుందని మండిపడ్డారు. ఈ వెబ్సైట్ మహిళా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని వారి వయస్సు, మొబైల్ నంబర్, చిరునామా మరియు వృత్తితో పాటు తప్పుడు వ్యక్తుల చేతిలోకి వస్తే విషాదకరమైన పరిణామాలను కలిగి ఉంటుంది, వెబ్సైట్ ECI లేదా CEO తెలంగాణ నుండి ఎటువంటి అధికారిక ప్రమాణీకరణ లేదా అధికారాన్ని పేర్కొనలేదని అన్నారు. ఇవి గాంధి భవన్ ఎన్నికల లేక భారతీయ ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికల అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారుల ప్రమేయం వల్లే ఓటరు జాబితా వివరాలు లిక్ అయ్యిందని పేర్కొన్నారు.
లంచం తీసుకొని వ్యవహిస్తున్న అధికారులు గాంధి భవన్ లో కుర్చీ వేసుకొని కూర్చొని ఎన్నికల జరపండి అంటూ మండిపడ్డారు. ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.ఎన్ని సార్లు కేసులు పెట్టిన ఫిర్యాదులు చేసిన పట్టించుకోని ఎన్నికల కమిషనర్ అధికారిని వెంటనే మార్చాలని కోరారు.www.vnrmlc.com యొక్క చట్టబద్ధతను పరిశోధించండి మరియు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవలని అన్నారు.ఓటర్ల గోప్యతను కాపాడేందుకు మరియు ఎన్నికల సమగ్రతను కాపాడేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయంపై సత్వర విచారణ జరిపించి క్రిమినల్ కేసులు పెట్టాలని కోరుతున్నా ఇంకా స్పందించలేదని అన్నారు.
ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తను సంవత్సరానికి 400 కోట్లకు పైగా విద్య ద్వారా సంపందించుకుంటామని తెలిపారు. మరొక్క బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ప్రభుత్వ ప్రిన్సిపాల్ లు, ఉద్యోగులు కలిసి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ విన్నర్ పబ్లికేషన్స్ ను పెట్టుకొని విద్యను అమ్ముకుంటూ సంవత్సరానికి 80 కోట్లకు పైగా సొమ్ము చేసుకుంటున్నారు. వీళ్లంతా బడి దొంగలు …పిల్లలకు పాఠాలు చెప్పకుండా ప్రసన్న హరికృష్ణ బడి దొంగగా సొమ్ము చేసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆరోపించారు.
విద్యావంతులనీ చెప్పుకుంటూ పోటీ చేస్తున్నవారు .. విద్యావేత్తలు కాదని.. విద్య వ్యాపారవేత్తలు అని మండిపడ్డారు. నేను విద్యార్థి దశ నుంచే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని … మేయర్ గా రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గా అనేక పథకాలకు శ్రీకరం చుట్టనని పేర్కొన్నారు. ఒకరూపాయికే అనేక అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేశామని అన్నారు. కుటుంబంలో పెద్దదిక్కు మృతి చెందితే దహన సంస్కారాలకు ఆర్థిక ఇబ్బందులు గురికావడం చూసి దేశంలోనే ఎక్కడలేని విధంగా కేవలం ఒక్క రూపాయికే అంత్యక్రియల (అంతిమ యాత్ర )పథకానికి శ్రీకారం చుట్టనని పేర్కొన్నారు. రాత్రి రాత్రి బట్టలు తెల్లబట్టలు రాజకీయాలకు రాలేదని అని నిత్యం నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ కోసమే తన జీవితాన్ని దారపోసానని అన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఎన్నికల్లో పోటీ చేసే అవసరం ఏముంది? ఇన్నేళ్లుగా అభ్యర్థులకు ప్రజాసేవ గుర్తులేదా అని మండిపడ్డారు. కరోనా సమయంలో ఏ ఒక్క నాయకుడు మీకు సహాయం చేశారా ? ఇప్పుడే మీకు గుర్తుకు వచ్చారా అని అన్నారు.నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే నేతలకు మండలిలో అవకాశం ఇస్తే ప్రశ్నించే గొంతుకనై గళమెత్తి పట్టభద్రుల హక్కుల కోసం పోరాడుతానని భరోసా ఇచ్చారు.
317 జీవో ఉద్యోగులకు శాపంగా మారిందని, వారికి అండగా నిలిచి రద్దు కోసం పోరాడుతానని అన్నారు. ప్రైవేట్ టీచర్లకు శ్రమ దోపిడి కాకుండా పూర్తి 12 నెలల జీతాన్ని అందించేలా పీఎఫ్ పొందుపరిచేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు ఇంకెప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రతిఒక్క పట్టభద్రులకు కేవలం ఒక రూపాయికే తోనే ఐదు లక్షల ఇన్సూరెన్స్ బీమా పథకాన్ని స్వయంగా అందజేస్తున్న అని హామీ ఇచ్చారు.కేవలం ఎన్నికల పేరుతో పట్టభద్రులను మభ్య పెట్టి మోసం చేస్తారు అని హెచ్చరించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ నెంబర్ 11 పై తనకు మొదటి ప్రాధాన్యత (1) ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి & న్యాయవాది తేజ్ దీప్ రెడ్డి కోమటిరెడ్డి, న్యాయవాది పిన్న రాములు, సిద్దిపేట కౌన్సిలర్ మనిదీప్ రెడ్డి, బీ ఆర్ ఎస్ పార్టీ యువజన నాయకులు రాజేశ్వర్ రెడ్డి, విద్యార్థి ఉద్యమకారుడు రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
