
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టభద్రులది కీలకపాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నరేందర్ రెడ్డికి మీరిచ్చే ఒక్క అవకాశం.. తెలంగాణ విద్యావ్యవస్థలో మార్పుకు ముందడుగన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారాస అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.
ఏమీ చేయలేదని మాపై దుష్ప్రచారం.. “
కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు. రాష్ట్రంతో పేగుబంధం తెంచుకుని పార్టీ పేరు కూడా మార్చుకున్నారు. చేసింది చాలు.. ఇక ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకోవాలని ప్రజలు ఆయనకు చెప్పారు. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్‌లో మార్పు రాలేదు. ఫామ్ హౌస్‌లో కూర్చుని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. పదేళ్లపాటు ఏమీ చేయని భారాస నేతలు.. ఇవాళ మమ్మల్ని తప్పుపడుతున్నారు. ఏడాదిలోనే మేం ఏమీ చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారు. పదేళ్లపాటు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇచ్చిన వాటి మీద వాళ్లే కేసులు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. 11వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. గత ప్రభుత్వం పదేళ్లపాటు టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించలేదు. మా ప్రభుత్వం రాగానే వాటిని పూర్తిచేశాం.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా 65 ఐటీఐలు..
చదువుతున్న యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. టాటా సంస్థతో కలిసి 65 ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. క్రీడల్లో యువత రాణించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చి రూ.2కోట్ల ప్రోత్సాహక నగదు అందజేశాం. క్రికెటర్ సిరాజ్ కు ఎన్నో మినహాయింపులతో గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చాం..పారా అథ్లెట్ వరంగల్ బిడ్డ జివాంజీ దీప్తికి ఇంటిస్థలం తో పాటు 25లక్షల నగదు అంద జేశారు..
- కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెలా రూ.600 కొట్ల వడ్డీ
26.50లక్షల మంది రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేశాం. సన్న వడ్లకు రూ.500 బోనస్ వచ్చి ఉంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను కేసీఆర్ రూ.7లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశారు. ఆ అప్పులకు ప్రతి నెలా రూ.600 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం. కేసీఆర్ పాలనలో ఏనాడూ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనజీతాలు రాలేదు. ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కేసీఆర్ రూ.8వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు. దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. రాహుల్‌గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తిచేశాం. వందేళు గా జరగని కులగణనను సమర్థంగా నిర్వహించాం” అని రేవంత్ అన్నారు.
తెలంగాణలో మోదీ ఉద్యోగాలు ఇచ్చింది ఇద్దరికే.. తెలంగాణలో 8 మంది భాజపా ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి వారు సాధించిందేటని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక 55వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాలలో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం మాట్లాడారు.”11 ఏళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు?2014, 2019 ఎన్నికల ప్రచారంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని చెప్పారు. ఆ లెక్కన 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణలో రెండు ఉ ద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఒకటి కిషన్‌రెడ్డికి.. మరొకటి బండి సంజయ్‌కు. వీరికి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చారా? ఇన్ని వేలమందికి ఉద్యోగాలు ఇవ్వని భాజపాకు ఓటు అడిగే హక్కు ఎక్కడిది?
మా ప్రభుత్వం వచ్చాక మొత్తం 55,163 మందికి ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామకపత్రాలు అందజేశాం. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు టెట్ నిర్వహించాం. 11 వేల మంది టీచర్ల నియామకం చేపట్టాం. పోలీసుశాఖలో 15 వేల మందికి ఉ ద్యోగాలు ఇచ్చాం. 6వేలకు పైగా పారామెడికల్ సిబ్బందిని నియమించాం. నేను చెప్పింది అబద్ధమైతే మాకు ఓటు వేయొద్దు. నిజమని నమ్మితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండన్నారు. గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ-రేసు కేసులు పెడితే.. పేపర్లన్నింటినీ ఈడీ తీసుకెళ్లింది. ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డుపెట్టుకుని లోక్‌సభఎన్నికల్లో భాజా ప్రభాకర్‌రావు, కేసులో నిందితులుగా ఉన్న మంత్రి బండి సంజయ్ ఎందుకు భారత్‌కు రప్పించడం లేదు? వాళ్లని మన దేశానికి రప్పించండి.. ట్యాపింగ్ కేసులో ఏం చేయాలో మేం అది చేస్తాం. ఆర్ఆర్ఆర్ భూసేకరణకు భాజపా ఎంపీ ఈటల రాజేందర్ అడ్డంగా పడుకుంటున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఈటల కలిసి రాష్ట్రం అభివృద్ధి కాకుండా కుట్రలు చేస్తున్నారు. హైటెక్ సిటీ కట్టింది మేమే. ఫ్యూచర్ సిటీ కట్టేది కూడా మేమే” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరీంనగర్ – నిజామాబాద్ – అదిలాబాద్ మెదక్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.





