
–పట్టభద్రుల, టీచర్స్ ల సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలి…కృష్ణారెడ్డి పిలుపు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని హుజరాబాద్ లో మార్నింగ్ వాకర్స్ ను బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం విస్తృత ప్రచారం నిర్వహించి, బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టభద్రుల, ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారి సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. అందుకే నిరుద్యోగ పట్టభద్రులు, టీచర్స్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తగిన గుణపాఠం చెప్పారని, అభయంతోనే నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిని కొని తెచ్చుకుందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత బిఆర్ఎస్ బాటలోనే నడుస్తుందన్నారు. నిరుద్యోగ పట్టభద్రులకు ప్రతినెల రూ.4000 ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, నేడు 14 నెలల కాలమైనా ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఒక్కో నిరుద్యోగి 54 వేల రూపాయలు బాకీ పడిందన్నారు. ఇక ఉద్యోగులు కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేని పరిస్థితిలో ఉన్నారని, టీచర్స్ అనేక సమస్యలు ఇబ్బందులతో బాధపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. పట్టభద్రుల , టీచర్స్ ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతి హామీ తో నిరుద్యోగ పట్టబద్రుల ఓట్లు దండుకొని మోసం చేసిన కాంగ్రెస్ కు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు కనీస బెనిఫిట్స్ కూడా అందించలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టీచర్స్ కూడా తగిన బుద్ధి చెప్తారన్నారు. పట్టభద్రుల, టీచర్స్ ల సమస్యల కోసం కొట్లాడింది, ముఖ్యంగా 317 జీవో కు వ్యతిరేకంగా ఉద్యమించింది కేవలం బిజెపి యే నని ఈ సందర్భంగా చెప్పారు. బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులను జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఆశీర్వదిస్తే vపట్టభద్రుల, టీచర్స్ గొంతుకను శాసనమండలిలో వినిపించి, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ నెంబర్ రావుల వేణు, మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, పైళ్ల వెంకట్ రెడ్డి, నల్ల సుమన్, సీనియర్ నాయకులు కొల్లిపాక శ్రీనివాస్, గంగిశెట్టి ప్రభాకర్, యాంసాని శశిధర్, సబ్బని రమేష్, గంట సంపత్, తిప్పబత్తిని రాజు, యాల్ల సంజీవరెడ్డి, కొల్లిపాక వెంకటేష్, కోడిమ్యాల పవన్, భాస్కర్ యాదవ్, బీమోజు వెంకట్, క్యాష వెంకటేష్, బోరగాల సారయ్య, తాళ్లపల్లి దేవేంద్ర, సబ్బని మాధవి, జంపాల సువర్ణ, తాళ్ల పెళ్లి హరీష్, బాబర్ తదితరులు పాల్గొన్నారు.





ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కరపత్రాలు పంచుతూ వాకర్స్ ను ఓటు అభ్యర్థిస్తున్న బిజెపి నాయకులు.
