
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ప్రమాదంలో గాయపడిన పట్టభద్రుడు స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు చివరి రోజు కరీంనగర్ జిల్లాలోని వివిధ కళాశాలలో పాఠశాలల్లోని పట్టభద్రులను కలిసి ఓట్లన్న అభ్యర్థించారు. సమస్యల పట్ల పోరాడే వ్యక్తిత్వం తనదని ప్రతి ఒక్కరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తే పట్టభద్రులకు ఆరు సంవత్సరాల సేవ చేస్తానని వారి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తినని పట్టబద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని డాక్టర్ల పర్యవేక్షణలోనే వీల్ చైర్ లో ఉండి ప్రచారం కొనసాగిస్తున్నానని ప్రతి ఒకరు తనకు మద్దతు ఇచ్చి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాగా శేఖర్ రావు ప్రచారానికి కట్టబద్రుల నుండి విశేష స్పందన లభించడం గమనార్హం.





