
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రాథమిక గొర్రెల కాపరుల సహకార సంఘం అధ్యక్షులుగా బద్దుల రాజ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఈ మంజుల తెలిపారు. మంగళవారం సహకార సంఘం డైరెక్టర్లుగా ఎంపికైన ఏడుగురి నుండి అధ్యక్ష ఎన్నికల కార్యక్రమం చేపట్టగా రాజ్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేయడంతో అతడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆమె తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా భాషాబోయిన రవి, డైరెక్టర్లుగా గండ్రకోట సారయ్య, భాషబోయిన రవి, లెంకలపల్లి రవీందర్, సింగరవేణి రవి, చేపూరి కొమరమ్మ డి స్వరూపలు ఎన్నికైనట్లు ఆమె తెలిపారు. నూతన పాలకవర్గానికి గొర్రెల కాపరుల సహకార సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు.

