
–అభినందించిన కళాశాల యాజమాన్యం
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ ఫిబ్రవరి 25: హుజురాబాద్ మండలం సింగాపురంలోని వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో మంగళవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. వి. ప్రాసెస్ మల్టిపుల్ కెరియర్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఫీన్ వర్స్, ఎస్ ఎస్ ప్లస్, ఐటీ సొల్యూషన్స్ , ఫిన్వర్జ్ కంపనీల ఎచ్ ఆర్ మేనేజర్లు కందుకూరి సత్యనారాయణ, కొరిమి పీతాంబర్, వినయ్ తదితరులు రాత పరీక్ష ఇంటర్వూలు నిర్వహించారు. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న 82 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఇందులో 35 మంది విద్యార్థులను ఉద్యోగాల నిమిత్తం కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. ఉద్యోగులకు ఎంపికైన విద్యార్థులను వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల సెక్రటరీ, మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వొడితల ఇంద్రనీల్, ప్రిన్సిపాల్ వివిఎన్. హనుమకుమార్ తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో విఎస్ ఆర్ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శనిగరపు రజిత, ప్లేస్మెంట్స్ ఆఫీసర్ తాళ్ళపల్లి అజయ్ కుమార్, సీనియర్ అసీస్టెంట్ పొతిరెడ్డి హరీష్, భాస్కర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలి
మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
డిగ్రీ విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, తద్వారా వారికి విస్తృతమైన ఉపాధి అవకాశాలు కార్పొరేట్ రంగంలో ఉన్నాయని వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. విఎస్ ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎంపిక కావడం హర్షణీయమని అన్నారు. విద్యార్థులు కార్పొరేట్ ఉద్యోగాలకు సంబంధించి నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు. కేవలం కార్పొరేట్ రంగంలోనే కాకుండా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలైన గ్రూప్ వన్ గ్రూప్ టు వంటి నోటిఫికేషన్ లపై కూడా దృష్టి పెట్టాలని శిక్షణ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన శిక్షణను కళాశాల అందిస్తుందని అన్నారు.




