
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని బ్రహ్మంగారి దేవాలయంలో గోవింద మాంబా సమేత శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం అతివైభవంగా నిర్వహించారు. అలాగే దేవాలయ పురోహితులైనటువంటి కోటగిరి ప్రవీణ్ శర్మ స్వతహాగా గుణించబడినటువంటీ నూతన పంచాంగమును దేవాలయ సభ్యులు కస్తూరి నరేంద్రచారి, మునిగంటి నాగరాజు, పేర్ల శ్రీనివాస్ రావు, శ్రీనివాస్, శ్రీరామోజు రమేష్, రావుల వేణుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికంగా పాల్గొన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు మరియు మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, సీనియర్ నాయకులు నల్ల సుమన్, కార్యకర్తలు పాల్గొన్నారు.




నూతన పంచాంగమును ఆవిష్కరిస్తున్న దేవాలయ సభ్యులు