
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మానకొండూర్ ఎంఎల్ఏ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని గంగిపల్లి గ్రామ శివారులోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంను సందర్శించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. గంగిపల్లి, వన్నారం, శంషాబాద్ గ్రామాల ప్రజలతో ఘనంగా నిర్వహించిన భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవతల కల్యాణ మహోత్సవానికి స్ధానిక శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, స్ధానిక తహసీల్దార్ రాజేశ్వరిలు హాజరై స్వామి వార్లకు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు, కానుకలు సమర్పించారు.
ఈ కల్యాణ మహోత్సవానికి దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు రెడ్డి సంపత్ రెడ్డి, సీనియర్ సిటిజన్, ప్రజాసంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు, సభ్యులు చలి గంటి ఓదెలు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రాచారి, మానకొండూర్ సింగిల్ విండో ఉపాధ్యక్షులు పంజాల శ్రీనివాస్, వాల అంజిత్ రావు, పోలాడి హన్మంతరావు, కల్యాణ మహోత్సవ నిర్వాహకులు జంగిలి రాజయ్య రేణుక, రాకేష్, డొల్ల రవి రేణుక, అర్చకులు కలకుంట్ల శేషు, నమిళికొండ రఘురామాచార్యులు, మాదవాచార్యులు, సంతోష్ లతో పాటు పాలక మండలి సభ్యులు, ప్రజా ప్రతినిధులు ,మాజీ సర్పంచ్, ఉప సర్పంచులు, ఎంపీటీసి లు వివిధ పార్టీల నాయకులు ఆయా గ్రామ పంచాయతి ఉద్యోగులు, చుట్టు పక్క గ్రామాల ప్రజలు భారీ ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.
ముందుగా నిర్వాహకులు స్వామి వార్లను భారీ ఎత్తున ర్యాలీగా నిర్వహించి కల్యాణ మంటపానికి వేద పండితుల మంత్రోత్సవాల తో తీసుకువచ్చారు. ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కల్యాణ మహోత్సవాన్ని తిలకించి తన్మయం చెంది పులకించిపోయారు.




దేవతల కల్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు, కానుకలు సమర్పిస్తున్న మానకొండూర్ ఎంఎల్ఏ కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన వెంట పోలాడి రామారావు.