
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుజ్జులపల్లె గ్రామంలో శివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సేవలండిస్తున్న హుజురాబాద్ లోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటరీల సేవలు అమోఘమని పలువురు కొనియాడారు. సుమారు 15 మంది విద్యార్థిని విద్యార్థులు దేవాలయం వద్ద పాల్గొని భక్తులకు సేవలు అందించారు. వీరి సేవలను గుర్తించి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విద్యార్థిని విద్యార్థులను చిన్న వయసు నుండే సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలని జీవితంలో ఇంకా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థిని విద్యార్థులు చేసిన సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ బి ప్రవీణ్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మేకల నవీన్ కుమార్, ఆలయ కమిటీ, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారులు చేసిన సేవలను అభినందించారు.




వాగ్దేవి కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించి అభినందిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు జెఎస్ఆర్.