
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో ముందు ఉంటూ తనకి జరిగిన యాక్సిడెంట్ ని కూడా లెక్కచేయకుండా సమాజ శ్రేయస్సుకై ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ సమాజం పట్ల పట్టభద్రుల పట్ల వారి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మరియు వారి సమస్యల పై పోరాడే వ్యక్తిగా ఆదరణ పొందుతున్నారు. మేజర్ యాక్సిడెంట్ అయిన ఆ దేవుని ఆశీర్వాదం మరియు పట్టభద్రులకు సేవ చేయాలని మంచి ఉద్దేశంతో వీల్ చైర్ లో ఉండి కూడా పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. బిజినెస్ మ్యాన్ కు సర్వీస్ మ్యానుకు జరుగుతున్న ఈ ఎలక్షన్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. పట్టబద్రులు తన వెంటే ఉన్నారని అన్నారు. తన గెలిచిన తర్వాత వచ్చే 72 నెలల జీతం మొత్తాన్ని పట్టభద్రుల అభివృద్ధికై రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా పట్టభద్రుల అభివృద్ధికి ఖర్చు చేస్తానని అని ప్రకటించిన ఒకే ఒక వ్యక్తి పట్టబద్రుల స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు అన్నారు.
