
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రతాపవాడ, పాతవాడ, బోర్నపల్లి శివాలయాలను భక్తులు భారీ సంఖ్యలో హాజరై శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పల్ నర్సింగాపూర్, తుమ్మనపల్లి, కందుగుల, పోతిరెడ్డిపేట, చెల్పూర్లోని శివాలయాల్లో అభిషేకాలు, శివపార్వతుల కల్యాణం, భజనలు నిర్వహించగా, బోర్నపల్లిలోని, సిర్సపల్లిలోని పార్వతీ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో పందిళ్ళ భాస్కర్ శర్మ, చెన్నూరి రాకేశ్ శర్మ, చెన్నూరి రాజేశ్ శర్మ, మల్లోజుల సందీప్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక అభిషేకాలతో పాటు, కళ్యాణం, లింగోద్భవ సమయంలో వెయ్యిలీటర్ల పాలతో అభిషేకం, అష్టోత్తర శతకలశాభిషేకం, మహా లింగార్చన నిర్వహించారు. జాగరణ సమయంలో భక్తులు భజనలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయాల కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి లింగోద్భావ కార్యక్రమాన్ని పూజారులు కనుల పండువగ నిర్వహించగా వందలాది మంది భక్తులు దానిని తిలకించి పరవశించిపోయారు. బోర్నపల్లి శివాలయంను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్, హుజురాబాద్ శివ రామాలయాన్ని ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో
బిజెపి పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, సీనియర్ నాయకులు నల్ల సుమన్, మండల అధ్యక్షులు రాముల కుమార్, సీనియర్ నాయకులు తిప్ప బత్తిని రాజు, అంకటి వాసు, దేవేందర్ రావు, యాంసాని శశిధర్, గంగిశెట్టి ప్రభాకర్, పోతుల సంజీవ్, నరాల రాజశేఖర్, గంట సంపత్, బోర్గల సారయ్య, కొలిపాక వెంకటేష్, హృతిక్, గంధం అనిల్, అజయ్, మహేష్, యాట రాజేష్, పవన్, ఆవుల సదయ్య, గుర్రం సంతోష్, క్యాశ వెంకటేష్, రాపాక రాజు, దేవేంద్ర, రమాదేవి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
మహా శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ భవానీ శంకర శివాలయం హుజురాబాద్ లో వాసవి వనిత క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అభిషేకం మరియు ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ZC నంగునూరి శైలజ, వాసవి వనిత క్వీన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ నార్ల అర్చన, సెక్రటరీ శివనాధుని స్వప్న, ట్రెజరర్ చికోటి త్రివేణి మరియు కార్యవర్గ సభ్యులు, క్లబ్ సభ్యులు అందరు పాల్గొన్నారు.

బోర్నపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్, కాంగ్రెస్ నాయకులు.

హుజురాబాద్ పాతవాడ శివాలయంలో దర్శనానికి బారులు తీరిన ప్రజలు, భక్తులు.



హుజురాబాద్ పాతవాడ శివాలయం వద్ద శివ కళ్యాణం నిర్వహిస్తున్న వేద పండితులు.. హాజరైన భక్తులు

పాతవాడ శివాలయంను సందర్శించిన బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి…


సిరసపల్లి శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో శివ కళ్యాణ నిర్వహిస్తున్న వేదపండితులు, హాజరైన భక్తులు.

హుజురాబాద్ లో ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్న వాసవి వనిత క్వీన్స్ క్లబ్ నాయకురాల్లు, మహిళలు.