
Oplus_131072
–మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించారు. కరీంనగర్ మంకమ్మ తోట ధన్ ఘర్ వాడి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేయగా, కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు ఆయనకు మద్దతుగా అక్కడ చేరుకున్నారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు విజయం ఎవరిదో తేలుస్తారు. ప్రజాస్వామ్య విలువలను రక్షించేలా, సమస్యలకు పరిష్కారం చూపేలా మా పోరాటం కొనసాగుతుంది” అని అన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ హక్కును వినియోగించుకుంటున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు తెలిపారు.
మందకొడిగా పోలింగ్.!
కరీంనగర్ జిల్లాలో మందకోడిగా పోలింగ్ జరుగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వలేదన్న కారణంతో ఓటర్లు ఓటు వేసేందుకు పెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు సగానికి పైగా జరగాల్సిన పోలింగ్ నామమాత్రంగా జరగడం ఓటర్ల నిరుత్సాహానికి కారణంగా చెప్పుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్ 18.9% ఓటు వేయగా, టీచర్స్ 35% మాత్రమే పోలింగ్లో పాల్గొన్నారు. కేవలం మరో మూడున్నర గంటల సమయం మాత్రమే ఉండగా సగానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాకపోవడంలో ఆంతర్యమేమిటో ప్రధాన పార్టీల నాయకులకు, కార్యకర్తలకు అంతుచిక్కడం లేదు.


ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చూపుతున్న పట్టభద్రులు

హుజురాబాద్ లో పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలో క్యాన్వసింగ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.