
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణలో నకిలీ RMP, PMPలకు మెడికల్ కౌన్సిల్ అధికారులు షాకిచ్చారు. నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. RMPలు వారి వద్దకు వచ్చే రోగులకు ఇష్టారీతిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ప్రజారోగ్యానికి పెనుముప్పు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటి వరకు 400 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది. ఏలాంటి ఇంజక్షన్, గోళీలు ఇచ్చే అధికారం ఆర్ఎంపి, పీఎంపీలకు లేదని తెలిపింది.
