
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన ఉద్యమంలో మృతి చెందిన పలువురికి శనివారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఎస్సీ వర్గీకరణ కోసం వారు చేసిన త్యాగాలు మరువలేని అని అన్నారు. సంస్మరణ దినోత్సవం సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసీ నివాల్లార్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, మాజీ కౌన్సిలర్ ముక్క రమేష్, ఇమ్మడి శ్రీధర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్, నాయకులు బొరగాల రాజ్ కుమార్, మొలుగూరి ప్రభాకర్, మోరే మదు, ఎర్ర రాజ్ కుమార్, మొలుగు శ్రీనివాస్, బొడ్డు ఐలయ్య, దేవునూరి రవీందర్, బొడ్డు సంజీవ్, అందాసీ నారాయణ, అరికిల్ల ఐలయ్య, మొలుగూరి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
