
–పద్మశాలి మహాసభలను విజయవంతం చేయాలి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీలలో పద్మశాలీలకు జనాభా దామాషా ప్రకారం చట్ట సభలలో ప్రాధాన్యత ఇవ్వాలని పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సబ్బని రాజేంద్రము కోరారు. ఆదివారం ఈ నెల 9న హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే పద్మశాలి మహాసభలకు సంబంధించిన కరపత్రాలను హుజురాబాద్ లోని పద్మశాలి సంఘ భవన్ లో కరపత్రాలను సంఘ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలి మహాసభలకు ఇంటికొక్కరు హాజరు కావాలని అన్నారు. కులబాంధవులు సభలలో పాల్గొని ఐక్యత చాటాలని కోరారు. పద్మశాలీల హక్కులను సాదించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో వోడ్నాల రామకృష్ణ, తౌటం సంపత్, గంజి జయవర్ధన్, సబ్బని శివాజీ, మంచికట్ల వెంకట్రాజం, దాసరి రమేష్, ఆడెపు సూర్యం తదితరులు పాల్గొన్నారు.

