
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, ఫిబ్రవరి 28:నిజామాబాద్, మెట్ పల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, కాజీపేట, మీదుగా తిరుపతికి ప్రతిరోజు రైలు నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
స్వర్ణోదయం ప్రతినిధి స్వతంత్రంగా చేపట్టిన సర్వేలో ప్రయాణికులు తన అభిప్రాయాన్ని వెల్లడించారని తెలిపారు. అదిలాబాద్ సికింద్రాబాద్ కాజీపేట మీదుగా కృష్ణ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు తిరుపతికి నడుస్తుంది. అయినప్పటికీ ప్రయాణికులు నిజామాబాద్, మెట్టుపల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, ఖాజీపేట, వరంగల్ మీదుగా రైలును ప్రతిరోజు నడిపించినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు. నిజామాబాదు నుండి వరంగల్ కు, వరంగల్ నుండి నిజామాబాద్ కు ప్రతిరోజు ఆర్టిసి 5 నిమిషములకు ఒక బస్సు చొప్పున నడిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో వరంగల్ నుండి నిజామాబాద్ కు, నిజమాబాద్ నుండి వరంగల్ కు వెళ్లే బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య కిక్కిరిసిపోతుంది. ప్రస్తుతము కరీంనగర్ నుండి తిరుపతికి వారానికి రెండు రోజులు రైలు నడుస్తున్న నేపథ్యంలో ఈ రైలు కరీంనగర్ తిరుపతి రైలును నిజాంబాద్ వరకు పొడిగించి ప్రతిరోజు నడిపించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. నిజమాబాదు నుండి వయా మెట్టుపల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, కాజీపేట, వరంగల్ మీదుగా ప్రతిరోజు రైలును నడిపించినట్లయితే రైల్వే శాఖకు భారీగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణికులకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు .
ఈ విషయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లయితే నిజామాబాద్ కరీంనగర్, పెద్దపల్లి జమ్మికుంట కాజీపేట వరంగల్, మీదుగా రైలును నడిపించినట్లయితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని వారు అంటున్నారు.
